'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే'.. కవిత కొత్త టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ సెటైర్!

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ
  • పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన‌ (టీఆర్ఎస్)'గా నామకరణం
  • ఒరిజినల్, ఫేక్ ఉత్పత్తుల ఫొటోలను షేర్ చేసిన బీఆర్ఎస్
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన‌ (టీఆర్ఎస్)' అని పేరు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది.

ఈ మేరకు బీఆర్ఎస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ సెటైరికల్ పోస్టు పెట్టింది. కోల్‌గేట్ టూత్‌పేస్ట్, బిస్లేరీ వాటర్ బాటిల్‌కు సంబంధించి ఒరిజినల్, నకిలీ ఉత్పత్తుల ఫొటోలను పక్కపక్కనే జోడించింది. దీనికి "ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!" అనే క్యాప్షన్‌ను జత చేసింది.

కవిత తన పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నప్పటికీ, తామే అసలైన పార్టీ అని బీఆర్ఎస్ ఈ పోస్టు ద్వారా పరోక్షంగా స్పష్టం చేసింది. తమ పార్టీ బ్రాండ్‌కే ప్రజల్లో ఆదరణ ఉంటుందని, కొత్తగా వచ్చిన పార్టీకి కాదని చెప్పకనే చెప్పింది. రాష్ట్రంలో అసలైన తెలంగాణ వాద పార్టీ తమదేనని చాటుకునే ప్రయత్నం చేసింది.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, 'తెలంగాణ రాష్ట్ర సేన‌' పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి ఈ స్పందన వచ్చింది. దీంతో టీఆర్ఎస్ పేరు చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

BRS
Kavitha
Telangana Rashtra Samithi
Telangana Rashtra Sena
Telangana Politics
KCR
Telangana Jagruthi
Political Satire
Revanth Reddy
Telangana

More Telugu News